తెలంగాణలో కొండపోచమ్మ సాగర్ జలాశయం ప్రారంభ కార్యక్రమానికి ఆధ్యాత్మికవేత్త త్రిదండి శ్రీరామనుజ చినజీయర్ స్వామిని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆహ్వానించారు. శంషాబాద్ ముచ్చింతల్లోని జీయర్ స్వామి ఆశ్రమానికి వెళ్లిన కేసీఆర్.. స్వామి ఆశీస్సులు తీసుకొన్నారు.
శుక్రవారం కొండపోచమ్మ సాగర్ జలాశయం ప్రారంభం సందర్భంగా చండీ, సుదర్శనయాగాలు నిర్వహించనున్నారు. మర్కూక్ పంప్ హౌజ్ వద్ద నిర్వహించే సుదర్శనయాగంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు.. చినజీయర్ స్వామి కూడా పాల్గొంటారు.
మరోవైపు.. కొండపోచమ్మ జలాశం వద్ద ప్రారంభ కార్యక్రమ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఏర్పాట్లను తెలంగాణ ఆర్థిక మంత్రి హారీశ్‌రావు స్వయంగా పరిశీలించారు.
ఇవీ చూడండి: