ఆరు ఏళ్ల బాలుడు గోడ మధ్యలో ఇరుక్కున్న ఘటన విజయవాడ భవానీపురం లేబర్ కాలనీలో జరిగింది. స్థానికంగా నివాసం ఉంటున్న చాట్రగడ్డ సోమయ్య కుమారుడు నిరంజన్.. ఆడుకుంటూ పక్కింటి గోడలో ఇరుక్కున్నాడు. ఊపిరి అందక ప్రమాదకర పరిస్థితులలో ఉన్న బాలుడిని భవానీపురం పోలీసులు చాకచక్యంగా బయటకు తీశారు. పోలీసుల స్పందనపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
ఇదీచదవండి.