కృష్ణా జిల్లా పోరంకిలోని ఓ బ్యాంకులో సిబ్బంది లాక్డౌన్ నిబంధనలు గాలికొదిలేశారు. ప్రభుత్వం తమ ఖాతాల్లో జమ చేసిన రుణాలు తీసుకునేందుకు డ్వాక్రా మహిళలు అధిక సంఖ్యలో బ్యాంకు వద్దకు చేరుకున్నారు. అయితే ఆ ప్రాంతం రెడ్జోన్లో ఉన్నప్పటికీ వారెవరూ భౌతిక దూరం పాటించలేదు. బ్యాంకు సిబ్బంది సైతం వ్యక్తిగత దూరాన్ని పట్టించుకోలేదు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు బ్యాంకు అధికారులతో మాట్లాడి మహిళలను చెదరగొట్టారు. కరోనా నేపథ్యంలో బ్యాంకు సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఇదీ చదవండి: