తపాలా ఉద్యోగులను కొవిడ్ వారియర్లుగా గుర్తించి ఆర్థిక సాయం చేయాలని... అఖిల భారత పోస్టల్ ఉద్యోగుల సంఘం డిమాండ్ చేసింది. కరోనాతో చనిపోయిన వారి కుటుంబాలకు 10 లక్షల పరిహారం ఇవ్వాలని కోరుతూ.. కృష్ణలంక లోని చీఫ్ పోస్ట్ మాస్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టింది. వైరస్ విజృంభిస్తున్న సమయంలోనూ ఉద్యోగులు సమర్ధంగా సేవలందించారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం తమ సేవలను విస్మరిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
కరోనా సమయంలో సేవలందిస్తూ 30 మందికి పైగా తపాలా ఉద్యోగులు చనిపోయారని వారి కుటుంబాలను ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన చెందారు. వైరస్ సోకిన వారందరికీ సెలవులు ఇవ్వాలని.. చికిత్సకు అవసరమైన సహాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళనను పోలీసులు అడ్డుకోవడంపై ఉద్యోగులు మండిపడ్డారు. డిమాండ్లు పరిష్కరించకపోతే పోరాటం ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: