దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నేడు కృష్ణానదిలో దుర్గామల్లేశ్వరస్వామి విహరించనున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ముందు జాగ్రత్తగా కృష్ణానదిలో హంస వాహనం ట్రయల్ రన్ నిర్వహించారు. పవిత్ర సంగమం నుంచి దుర్గాఘాట్ వరకు వాహనం నడిపారు. పున్నమిఘాట్, ప్రకాశం బ్యారేజ్, సీతానగరం నుంచి తెప్పోత్సవం తిలకించేందుకు భారీ ఏర్పాట్లు చేశారు. దుర్గాఘాట్‌లో పైవంతెన పనులతో వీఐపీ పాస్‌ల సంఖ్యను కుదించారు. కేవలం వెయ్యి పాసులే జారీ చేశారు. హంస వాహనంపై 32 మందికే అనుమతి ఇస్తామని విజయవాడ సీపీ విజయవాడ తెలిపారు.
ఇవీ చూడండి-కాకినాడ జంటహత్యల కేసును ఛేదించిన పోలీసులు