విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకునే పదోతరగతి పరీక్షలు వాయిదా వేసినట్లు విద్యాశాఖ మంత్రి సురేశ్ తెలిపారు. కరోనాతో మృతిచెంది ఉపాధ్యాయుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని ఆయన తెలిపారు. పరిస్థితులు మెరుగు పడిన తర్వాత పరీక్షలను నిర్వహిస్తామన్నారు.
పరీక్షల విషయంలో ప్రతిపక్షాలు వాస్తవాలు గ్రహించాలని మంత్రి సురేష్ సూచించారు. పదోతరగతి పరీక్షల రద్దు ద్వారా నారా లోకేశ్ ఏం సాధించాలనుకుంటున్నారని ప్రశ్నించారు. పరీక్షలు రాయనంత మాత్రాన కరోనా రాదని గ్యారంటీ ఇవ్వగలరా అని నిలదీశారు.
ఇదీ చదవండి: జాబ్ క్యాలెండర్ ప్రకటనలో జాప్యంపై సీఎం ఆగ్రహం