ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి తెలుగు యువత రాష్ట్ర నాయకులు మద్దిపట్ల సూర్యప్రకాశ్, రాంగోపాల్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో రైతులకు చేసింది శూన్యమని, అయినప్పటికీ ఆయన జయంతిని రైతు దినోత్సవంగా ప్రకటించారని లేఖలో పేర్కొన్నారు.
43 వేల కోట్లు దోచుకుని 11 కేసుల్లో ఏ1 ముద్దాయి 16 నెలలు జైల్లో ఉండి దేశంలోని దొంగలందరికీ ఆదర్శంగా నిలిచిన ముఖ్యమంత్రి జగన్ పుట్టినరోజు డిసెంబర్ 21వ తేదీన దొంగల దినోత్సవంగా ప్రకటించాలన్నారు. అలాగే మరికొందరు వైకాపా మంత్రులు, ఎమ్మెల్యేల పుట్టినరోజుల్ని కూడా ప్రత్యేక దినోత్సవాలుగా గుర్తించాలని లేఖలో కోరారు.
విజయసాయిరెడ్డి జన్నదినాన్ని దొంగలెక్కల దినోత్సవం, బొత్స పుట్టినరోజును లిక్కర్ దినోత్సవం, మంత్రి అనిల్ కుమార్ పుట్టిన రోజును బెట్టింగ్ దినోత్సవం, మంత్రి అవంతి పుట్టిన రోజును జంపింగ్ డే, రోజా పుట్టిన రోజును మహిళా సాంప్రదాయ దినోత్సవం, అంబటి రాంబాబు పుట్టిన రోజును గోబెల్స్ దినోత్సవం, ఎమ్మెల్యే రజనీ పుట్టిన రోజును పబ్లిసిటి డేగా ప్రకటించాలని లేఖలో పేర్కొన్నారు
ఇదీ చూడండి