ETV Bharat / state

కజక్​స్థాన్​లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు

కజక్​స్థాన్​లోని ఆల్మాటీ విమానాశ్రయంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 25మంది విద్యార్థులు చిక్కుకున్నారు. ఇండియాలో అంతర్జాతీయ విమానాల రాకను నిషేధించడం వల్ల వీరు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎలాగైనా తమను స్వదేశానికి వచ్చేలా చూడాలని అధికారులను కోరుతున్నారు.

Telugu students trapped in Kazakhstan
కజక్​స్థాన్​లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు
author img

By

Published : Mar 22, 2020, 6:33 AM IST

తెలుగు రాష్ట్రాలకు చెందిన 25 మంది విద్యార్థులు కజక్‌స్థాన్‌లోని అల్మాటీ విమానాశ్రయంలో చిక్కుకుపోయారు. రెండు రోజులుగా స్వదేశానికి వచ్చేందుకు ఎదురుచూస్తున్నారు. అక్కడి సెమిస్టేట్‌ విశ్వవిద్యాలయంలో వారంతా ఎంబీబీఎస్‌ చదువుతున్నారు. భారతదేశంలో అంతర్జాతీయ విమానాల రాకను నిషేధించడంతో వీరు ఇబ్బంది పడుతున్నారు. కృష్ణాజిల్లాకు చెందిన వెంకటేశ్వరప్రసాద్‌ అదే విశ్వవిద్యాలయంలో ఎంబీబీఎస్‌ మూడో సంవత్సరం చదువుతున్నాడు. అక్కడినుంచి రావడానికి వీలుకుదరక ఇబ్బంది పడుతున్నాడని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. భారత ప్రభుత్వం స్పందించి విద్యార్థులను తీసుకురావాలని విజ్ఞప్తిచేశారు.

ఇదీ చదవండి.

'జనతా కర్ఫ్యూని విజయవంతం చేయండి'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.