కృష్ణా జిల్లా నూజివీడు అమెరికా ఆసుపత్రిలో టెలీమెడిసిన్ కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రతాప అప్పారావు ప్రారంభించారు. విజయవాడ రమేష్ ఆసుపత్రి సహకారంతో ఇలాంటి అత్యాధునిక సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు. టెలీ మెడిసిన్ ద్వారా ...అత్యవసర పరిస్థితుల్లో ఫోన్, ట్యాబ్ల ద్వారా ఆరోగ్య సమస్యలపై సందేహలు నివృత్తి చేసుకోవచ్చని తెలిపారు. గుండె సంబంధిత బాధితులకు తక్షణమే వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. విజయవాడ నగరంలో వైద్య సౌకర్యాలు లేని రోజుల్లోనూ... నూజివీడు అమెరికా ఆసుపత్రిలో ప్రజలు వైద్య సేవలు పొందేవారని తెలిపారు. ఆసుపత్రికి ఆరోగ్యశ్రీ వర్తింపజేసేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే ప్రతాప్ తెలిపారు.
ఇదీ చూడండి: రిజిస్ట్రేషన్ ధరల పెంపునకు గ్రీన్ సిగ్నల్