విజయవాడ రూరల్ మండలం పి.నైనవరం గ్రామంలో 'మనం-మన పరిశుభ్రత' పేరుతో ప్రభుత్వం కార్యక్రమం చేపట్టింది. ఈ క్రమంలో ప్రతి ఇంటి నుంచి నెలకు రూ.60 వసూలు చేస్తోంది. దీనికి సీపీఎం నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. గ్రామసభలో వైకాపా నేతలు మాట్లాడటాన్ని గ్రామపెద్దలు, తెదేపా నాయకులు తప్పుపట్టారు. ప్రజా సమస్యలపై అధికారులు సమాధానం చెప్పాలి కానీ..నాయకులు మాట్లాడటమేంటని మండిపడ్డారు. గ్రామంలో ఇళ్లస్థలాల లబ్దిదారుల జాబితా ఎంపికలోనూ.. అవకతవకలు జరిగాయంటూ తెదేపా నాయకులు ఆరోపించడంతో..గ్రామసభలో గందరగోళం నెలకొంది.
ఇదీ చదవండి: ప్రభుత్వ తీరుపై హైకోర్టును ఆశ్రయించనున్న నిమ్మగడ్డ