ETV Bharat / state

Gudivada Casino Issue : గుడివాడ క్యాసినో వ్యవహారాన్ని పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్తాం: వర్ల రామయ్య

Varla Ramaiah on Gudivada casino issue : గుడివాడ క్యాసినో వ్యవహారాన్ని పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్తామని తెదేపా సీనియర్ నేత వర్ల రామయ్య తెలిపారు. ఈడీ, డీఆర్ఐ, ఎన్​సీబీ, కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖకు తమ ఎంపీల ద్వారా ఫిర్యాదు చేస్తామన్నారు.

వర్ల రామయ్య
వర్ల రామయ్య
author img

By

Published : Feb 4, 2022, 8:31 PM IST

Varla Ramaiah on Gudivada casino issue : పార్లమెంటు దృష్టికి గుడివాడ క్యాసినో వ్యవహారాన్ని తీసుకెళ్తామని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య తెలిపారు. తమ నలుగురు ఎంపీల ద్వారా ఈడీ, డీఆర్ఐ, ఎన్​సీబీ, కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖకు ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు.

సంక్రాంతి సందర్భంగా గోవా నుంచి గుడివాడ ఇందిరాగ్రాండ్ హోటల్​కు 36మంది యువతులు వచ్చారని వర్ల రామయ్య తెలిపారు. గోవా మహిళలతో క్యాసినో నిర్వహించడమేగాక అసభ్యకర నృత్యాలు, అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించారని మండిపడ్డారు. క్యాసినో నిర్వహించిన ప్రవీణ్ చికోటి టీమ్ గుడివాడ అతిథి హోటల్ లో బస చేసిందని వెల్లడించారు. 7లారీల్లో సామగ్రి తెచ్చి కె.కన్వెన్షన్ ప్రాంగణంలో క్యాసినోకు సెట్టింగ్ వేశారని అన్నారు. 17వతేదీన తాము ఫిర్యాదు చేశామన్న వర్ల.. రెండు రోజుల్లో పూర్తయ్యే విచారణను 20రోజులైనా ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు.

ఇదీ చదవండి

Gudivada Casino Issue :గుడివాడ క్యాసినోపై జాతీయ సంస్థలకు ఫిర్యాదు: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.