
రాష్ట్రంలో కరోనా నివారణకు ప్రభుత్వం చేసిన ఖర్చు కంటే.. వచ్చిన విరాళాలే ఎక్కువని తెదేపా సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎద్దేవా చేశారు. అందరూ పాలు పోస్తే.. ఊరి పెద్ద నీరు పోసినట్లుగా ప్రభుత్వ తీరు ఉందని విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగులు, కార్పొరేట్లు, దాతల ద్వారా సుమారు రూ.500 కోట్ల వరకు విరాళాలు వచ్చాయన్న ఆయన.. ఇప్పటివరకు ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ప్రజలే ప్రజలకు అండగా నిలుస్తున్నారని అన్నారు. నిత్యావసరాల నుంచి మాస్కుల వరకు స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్నాయని ట్విటర్లో ప్రశంసించారు.
ఇదీ చూడండి: