విజయవాడ నగరాన్ని కాపాడుకోవాలంటే తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ఎంపీ కేశినేని నాని పిలుపునిచ్చారు. నగరంలోని డివిజన్లలో బీసీ నాయకులకు ప్రాధాన్యత ఇచ్చామని నాని చెప్పారు. భాజపాకు వైకాపా అమ్ముడుపోయిందని, ముస్లింల విషయంలో కేంద్రానికి వ్యతిరేకంగా పని చేస్తోందని విమర్శించారు. కేశినేని భవన్‌లో తూర్పునియోజకవర్గ డివిజన్ అభ్యర్థులకు నామినేషన్ పత్రాలను ఎంపీ నాని అందించారు. డివిజన్ పరిధిలోనే కార్పొరేటర్ అభ్యర్థుల ఎంపిక పూర్తి చేయటం గర్వంగా ఉందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు తెలిపారు. అభ్యర్థుల ఎంపిక పారదర్శకంగా, కార్యకర్తల సమ్మతం మేరకు జరిగిందని చెప్పారు.
ఇవీ చదవండి: ఆ ఊరు స్థానిక ఎన్నికలను బహిష్కరించింది.. ఎందుకంటే..!