విశాఖ ఉక్కు కర్మాగారం కోసం అవసరమైతే సీఎంతో సహా ఎంపీలు రాజీనామాలు చేయాలని తెదేపా ఎంపీ కేశినేని నాని అన్నారు. కర్మాగారాన్ని ప్రైవేట్‌పరం చేయాలనుకునే నిర్ణయాన్ని ఉపసంహరించుకునేదాకా తెదేపా పోరాటం చేస్తుందని తమ అధినేత చంద్రబాబు స్పష్టం చేసినట్లు తెలిపారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకుందాం అనే అంశంపై విజయవాడ దాసరి భవన్లో అఖిలపక్ష పార్టీల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. కర్మాగారం విషయంలో సీఎం మౌనం వీడాలని డిమాండ్ చేశారు.
ఉద్యోగ సంఘాలు ఏమి చేస్తున్నాయి..
మంత్రి పెద్దిరెడ్డి ఉద్యోగులను బెదిరిస్తున్నట్లు మాట్లాడుతుంటే ఉద్యోగ సంఘాలు ఏమి చేస్తున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ నిలదీశారు. ఎన్నికల అంశంలో సుప్రీంకోర్టు వరకు వెళ్లిన ఉద్యోగ సంఘాలు.. మంత్రి వ్యాఖ్యలపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఉద్యోగులకు జీతాలిస్తున్నది పెద్దిరెడ్డి కాదు.. ప్రజలు అని తెలిపారు. తెలుగు ప్రజలంతా కలిసి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకోవాలని ఆంధ్రమేధావుల ఫోరం అధ్యక్షులు చలసాని శ్రీనివాసస్ పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి: ఏపీ ఫైబర్ నెట్ లిమిటెడ్ ఛైర్మన్‌గా గౌతమ్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ