మాట్లాడుతున్న తెదేపా ఎమ్మెల్సీ గౌరివాని శ్రీనివాసులు వైకాపా ఆరు నెలల పాలనలో ప్రజలకు చేసిందేమీలేదని తెదేపా ఎమ్మెల్సీ గౌరివాని శ్రీనివాసులు ఆరోపించారు. మంగళగిరి తెదేపా కార్యాలయంలో మాట్లాడిన ఆయన... రాజధానిని నిలిపివేయడం, ప్రజావేదిక కూల్చడం, ప్రభుత్వ భవనాలు, పాఠశాలలు, పంచాయతీ భవనాలు, శ్మశానాలకు వైకాపా రంగులు వేయడం తప్ప కొత్తగా వైకాపా చేసిందేమీలేదన్నారు. భవనాలకు వైకాపా రంగుల కోసం రూ.1300 కోట్లు, ముఖ్యమంత్రి నివాస సౌకర్యాలకు రూ.15 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం తప్ప, అభివృద్ధి శూన్యమని శ్రీనివాసులు మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాలు 15 రోజుల పాటు నిర్వహిస్తేనే ప్రజాసమస్యలు పూర్తిగా చర్చకు వస్తాయన్నారు. ఇదీ చదవండి :
'ప్రభుత్వానికి ఉల్లి తడాఖా స్థానిక ఎన్నికల్లో తెలుస్తుంది'