

మూడు ముక్కలాట మొదలుపెట్టిన వైకాపా నాయకులు... ప్రజాభిప్రాయం అనగానే ఎందుకు తోకముడుస్తున్నారని తెదేపా ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ ప్రశ్నించారు. మూడు ముక్కలపై నమ్మకం ఉంటే వైకాపా నేతలు రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి జగన్... మోసానికి నిలువెత్తు రూపమని ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు అమరావతిని అభివృద్ధి చేస్తానన్న జగన్ ఇప్పుడు 81 మంది రైతుల్ని బలితీసుకొని, వారి కుటుంబాలను రోడ్ల మీద నిలబెట్టాడని మండిపడ్డారు. సీఎం తీసుకున్న నిర్ణయంలో స్వార్థం లేకపోతే ప్రజాభిప్రాయం తీసుకోవడానికి ఎందుకు భయపడుతున్నారని నిలదీశారు.
ఇదీ చదవండి :