మంత్రి అవంతి శ్రీనివాస్ అబద్ధాలకు మారుపేరుగా నిలిచారని తెదేపా ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు ఆరోపించారు. మునిగిన పడవను 38 రోజులపాటు తీయలేనందుకు సిగ్గుపడాల్సిందిపోయి గొప్పలు చెప్పుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులను రోడ్డున పడేసి దీపావళి రోజున వారి జీవితాల్లో చీకట్లు నింపారని దుయ్యబట్టారు. ఐదు నెలల్లో సంక్షేమ రంగంపై ఒక్క పైసా ఖర్చు చెయ్యకుండా... రాష్ట్రంలో సమస్యలే లేవని అవంతి గొప్పలు చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు.
ఇదీ చూడండి: