అమరావతిని గ్రాఫిక్స్ అంటూ ట్విట్ చేసిన వైకాపా ఎంపీ విజయ సాయిరెడ్డికి తెదేపా ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న సవాల్ విసిరారు. దమ్ముంటే అక్కడ చంద్రబాబు కట్టించిన భవనంపై నుండి దూకి గ్రాఫిక్స్ అని నిరూపించాలని అన్నారు. మూడు ముక్కలాట మొదలుపెట్టి ఒక్క ఇటుక పెట్టని వైకాపా ప్రభుత్వమా.. విశాఖలో అద్భుత నగరాన్ని కట్టేది అంటూ ఎద్దేవా చేశారు. రాజధాని నిర్మాణం అంటే బ్లూ మీడియాలో గ్రాఫిక్స్ జనాన్ని పెట్టినంత ఈజీ కాదని విజయ సాయిరెడ్డికి హితవు పలికారు. విజయసాయి రెడ్డి ఎప్పుడు వస్తారో చెబితే మీడియాతో సహా బిల్డింగ్ కింద వెయిట్ చేస్తానంటూ ఎద్దేవా చేశారు.
ఇదీ చదవండి: