కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించడంలో, బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెదేపా ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు విమర్శించారు. పార్టీ పిలుపు మేరకు ప్రభుత్వ అసమర్ధ విధానాలను నిరసిస్తూ కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని ఆయన నివాసంలో ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు.
ఇప్పటికైనా ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలు మాని కొవిడ్ బాధితులను ఆదుకోవడంపై దృష్టి పెట్టాలన్నారు. విస్తృతంగా వైరస్ నిర్ధరణ పరీక్షలు చేసి ఫలితాలు వెంటనే తెలియజేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ, పలువురు తెదేపా నాయకులు అర్జునుడు దీక్షకు సంఘీభావం ప్రకటించారు.
ఇవీ చదవండి...