అసెంబ్లీ సమావేశాలు సక్రమంగా నిర్వహించకుండా ప్రభుత్వం తప్పించుకుంటోందని తెదేపా ఎమ్మెల్సీ అశోక్‌బాబు విమర్శించారు. బిల్లుల ఆమోదానికి మాత్రమే సభ నిర్వహించాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలు, పాలనలోని లోపాలు ప్రజలకు తెలియాలంటే సభ సజావుగా జరగాలన్నారు. ఇసుక, మద్యం, శాంతిభద్రతల సమస్య, ధరల భారం, త్వరలో పెంచబోయే ఆస్తిపన్ను, పీపీఏలు, పోలవరం వంటి వాటిపై ప్రభుత్వ వైఖరి తెలియాలంటే అసెంబ్లీలో చర్చ ఒక్కటే మార్గమని అశోక్‌బాబు అన్నారు. ప్రజల ముందు ప్రభుత్వ అసమర్ధతను ప్రతిపక్షాలు ఎండగడతాయన్న భయంతోనే అసెంబ్లీ సక్రమ నిర్వహణకు వెనకాడుతున్నారని మండిపడ్డారు. నిబంధనల ప్రకారం సభ జరిగేలా బీఏసీలో స్పీకర్‌పై ఒత్తిడి తెస్తామని వెల్లడించారు.
ఇవీ చదవండి..
'అధికారంలోకి వచ్చి 18 నెలలైనా ఇసుక సక్రమంగా ఇవ్వలేకపోతున్నారు'