కష్టకాలంలో పేదలకు సాయం అందించడానికి మనసురాని జగన్ రంగుల కోసం 2,600 కోట్లు ఖర్చు చేయడం సిగ్గుచేటని టీడీఎల్పీ ఉపనేత నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. కరోనా విపత్తులో ప్రజల చుట్టూ తిరగవలసిన ప్రభుత్వం...కోర్టుల చుట్టూ తిరుగుతోందని ఎద్దేవా చేశారు. అప్పుల్లో రాష్ట్రం ఉందని చెప్పి పార్టీ రంగుల కోసం కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే హక్కు జగన్కు ఎక్కడిదని నిలదీశారు. ప్రభుత్వ కార్యాలయాలపై రంగుల ఖర్చు.. వైకాపా ఖాతా నుంచి రాష్ట్ర ఖజానాకు చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ పార్టీ రంగులు ఉత్తర్వులు జారీ చేసిన అధికారులను జైలుకు పంపించాలనన్నారు.
'రంగుల ఖర్చు.. వైకాపా ఖాతా నుంచి రాష్ట్ర ఖజానాకు చెల్లించాలి' - ప్రభుత్వ కార్యాలయాలకు వైకాపా రంగు వార్తలు
కరోనా విపత్తులో ప్రజల క్షేమాన్ని మరిచి రంగుల కోసం పాకులాడిన సీఎం జగన్ రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలని టీడీఎల్పీ ఉపనేత నిమ్మల రామానాయుడు డిమాండ్ చేశారు.
కష్టకాలంలో పేదలకు సాయం అందించడానికి మనసురాని జగన్ రంగుల కోసం 2,600 కోట్లు ఖర్చు చేయడం సిగ్గుచేటని టీడీఎల్పీ ఉపనేత నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. కరోనా విపత్తులో ప్రజల చుట్టూ తిరగవలసిన ప్రభుత్వం...కోర్టుల చుట్టూ తిరుగుతోందని ఎద్దేవా చేశారు. అప్పుల్లో రాష్ట్రం ఉందని చెప్పి పార్టీ రంగుల కోసం కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే హక్కు జగన్కు ఎక్కడిదని నిలదీశారు. ప్రభుత్వ కార్యాలయాలపై రంగుల ఖర్చు.. వైకాపా ఖాతా నుంచి రాష్ట్ర ఖజానాకు చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ పార్టీ రంగులు ఉత్తర్వులు జారీ చేసిన అధికారులను జైలుకు పంపించాలనన్నారు.
TAGGED:
tdlp news