తెదేపా ఎమ్మెల్యే గద్దె రామమోహన్ రావు దంపతులపై వైకాపా తూర్పు నియోజక ఇంచార్జీ దేవినేని అవినాష్ చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని... తెదేపా నేతలు రత్నం రమేష్ తదితరులు డిమాండ్ చేశారు. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్‌ను చూసి.. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నేర్చుకోవాలని అన్నారు. ప్రతీ పేద కుటుంబానికి 5 వేలు ఇవ్వమని కోరడంలో తప్పు లేదని.. అది ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. హూద్‌హూద్ తుఫాన్ సమయంలో పేదలకు 5 వేల రూపాయలు ఇవ్వాలని ఆనాడు ప్రతిపక్ష నేతగా జగన్ డిమాండ్ చేశారని గుర్తు చేశారు. ఈ ఆపద సమయంలో ప్రజలకు 5వేలు ఇవ్వాలనే డిమాండ్‌లో న్యాయం ఉందన్న విషయం అవినాష్ గ్రహించాలని హితవు పలికారు. ఎమ్మెల్యే డిమాండ్ మేరకు నియోజక వర్గంలోని పేదలకు.. 5వేల రూపాయలు ఇచ్చే విధంగా అవినాష్ కృషి చేయాలని సవాల్ చేశారు.
ఇదీ చదవండి: దీక్షల పేరుతో తెదేపా నేతల డైటింగ్: మంత్రి వెల్లంపల్లి