తెదేపా నేతలపై కక్ష సాధించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఇంకా మూడేళ్లు సమయం ఉందని.. ముందు కరోనా నుంచి ప్రజల ప్రాణాలు కాపాడాలని తెదేపా శాసన సభాపక్ష విప్ డోలా బాలవీరాంజనేయ స్వామి డిమాండ్ చేశారు. కరోనా నిబంధనలపై ప్రజలకు జాగ్రత్తలు చెప్పించాల్సిన పోలీసులతో.. తెదేపా నేతలపై కక్షసాధించేలా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అధికారంలోకి వచ్చిన నాటి నుంచి జగన్మోహన్ రెడ్డి కుట్రలన్నీ సహిస్తున్నామని, వారి కల్మశ రాజకీయాలను ప్రజా కోర్టులోనే నిలబెడతామని డోలా బాలవీరాంజనేయ స్వామి హెచ్చరించారు.
ఇవీ చూడండి...