వైకాపా అండతోనే నేరగాళ్లు పేట్రేగిపోతున్నారని తెదేపా నేతలు ఆరోపించారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో ఎస్సీ యువతి హత్యకు నిరసనగా 25 పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రాల్లో కొవ్వొత్తుల ప్రదర్శనలు చేపట్టారు. "రాక్షస పాలనలో ఆడబిడ్డలకేది రక్షణ’’ అనే బ్యానర్లు పట్టుకొని ప్రదర్శన చేపట్టారు. మహిళలపై దాడులకు పాల్పడుతున్న వ్యక్తును కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
వైకాపా 19నెలల పాలనలో మహిళలపై 400కుపైగా అఘాయిత్యాలు జరిగాయని.. ఇది రాష్ట్రంలో శాంతిభద్రతల క్షీణించిన నిదర్శనమని నేతలు ధ్వజమెత్తారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో చేపట్టిన కాగడాల ర్యాలీలలో తెదేపా శ్రేణులు భారీగా పాల్గొన్నారు.
ఇదీ చూడండి: