తెదేపా ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిని అరెస్టు చేయడంపై ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ మండిపడ్డారు. బడుగు బలహీన వర్గాలను లక్ష్యంగా చేసుకుని రాజారెడ్డి రాజ్యాంగాన్ని ప్రభుత్వం బ్రహ్మాండంగా నడుపుతోందని దుయ్యబట్టారు. బడుగు బలహీనవర్గాలంటే సీఎం జగన్కు ఎంత కక్ష ఉందో దీనిని బట్టే స్పష్టమైందని మండిపడ్డారు. శాసనసభలో అచ్చెన్నాయుడిని ఎదుర్కోలేక ఈ చర్యకు ఒడిగట్టారని విమర్శించారు.
ఇదీ చదవండి: 'అన్యాయాలు, అరాచకాలు బయటపెడుతున్నందుకే అరెస్టులు'