ETV Bharat / state

'తెదేపా నేతల అరెస్టులపై ఎస్ఈసీ స్పందించాలి'

author img

By

Published : Feb 4, 2021, 6:54 PM IST

తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడును అక్రమంగా అరెస్టు చేశారని రాష్ట్రవ్యాప్తంగా తెదేపా నేతలు ఖండించారు. పట్టాభిపై దాడి, గొల్లలగుంట ఘటనలు ఆందోళనకు గురిచేస్తున్నాయని మండిపడ్డారు. పంచాయతీ ఎన్నికల్లో తెదేపా శ్రేణులు విజయభేరి మోగించాలని నాయకులు పిలుపునిచ్చారు.

tdp leaders condemn of achenna arrest
అచ్చెన్నాయుడు అక్రమ అరెస్టు పై తెదేపా నేతల మండిపాటు

ఎస్ఈసీ జోక్యం చేసుకోవాలి..!

అచ్చెన్నాయుడి అరెస్ట్, పట్టాభిపై దాడిని తెదేపా శ్రేణులు ఖండించాయి. మంత్రులు, వైకాపా ఎమ్మెల్యేలు, భయపెట్టి బెదిరిస్తూ నాటుబాంబులు, వేటకొడవళ్లతో ఏకగ్రీవాలు చేస్తున్నారని రాష్ట్ర ఎస్సీసెల్ అధ్యక్షుడు ఎంఎస్ రాజు అన్నారు. అచ్చెన్నాయుడిపై నాన్ బెయిలబుల్ కేసులుపెట్టి అరెస్ట్ చేయడమేంటని ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వం ఎలాంటి ఏకగ్రీవాలు కోరుకుంటోందో ప్రజలకు అర్థమైందన్నారు. మంత్రి పెద్దిరెడ్డి నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ కేసులు, బెదిరింపు ధోరణిలో సాగుతున్న ఏకగ్రీవాలు, తెదేపా నేతల అరెస్ట్ వ్యవహారంపై ఎస్ఈసీ జోక్యం చేసుకోవాలని కోరారు. ఎస్ఈసీ స్పందిస్తే ఎన్నికలు, ఎన్నికల వ్యవస్థపైనా ప్రజలకు బలమైన నమ్మకం పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు.

ఆ ఎమ్మెల్యేను ఎందుకు అరెస్ట్ చేయలేదు..?

టెక్కలి వైకాపా ఇంఛార్జ్ రౌడీ షీటరైన దువ్వాడ శ్రీనివాస్ పై పోలీసులు చర్యలు తీసుకోకుండా అచ్చెన్నను జైలుకు పంపటమేంటని తెదేపా ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు ధ్వజమెత్తారు. అభ్యర్థులను బెదిరించిన వైకాపా యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబుపై చర్యలు ఎందుకు తీసుకోలేదన్నారు. అధికార పార్టీ నేతలతో ఒకలా ప్రతిపక్ష పార్టీ నేతలతో మరోలా వ్యవహరించటం పోలీసులకు తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టం అందరికి ఒకేలా ఉండాలని హితవుపలికారు. తక్షణమే పోలీసులు దువ్వాడ శ్రీనివాస్, కన్నబాబు రాజులపై చర్యలు తీసుకోవాలని, లేకుంటే గవర్నర్​కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.

బీసీలపై కక్షసాధింపు చర్యలా..?

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడును అక్రమంగా అరెస్టు చేశారని కర్నూలులో తెదేపా నాయకులు ధర్నా చేశారు. వైకాపా ప్రభుత్వం బీసీ అగ్ర నాయకులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని కర్నూలు పార్లమెంట్ తెదేపా అధ్యక్షుడు సొమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు.. బీసీలంతా ఏకమై జరగనున్న పంచాయితీ ఎన్నికల్లో తెదేపాకు మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు.

ఇదీ చూడండి.

అమ్మ ఒడి నగదు అడిగినందుకు.. విద్యార్థికి చెంపదెబ్బల శిక్ష!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.