విజయవాడ దుర్గగుడి ఏసీబీ సోదాల్లో బయటపడిన అక్రమాల్లో అసలు దొంగ మంత్రి వెలంపల్లేనని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆరోపించారు. ప్రభుత్వం అవినీతి తిమింగలాన్ని వదిలేసి చిరుద్యోగులపై చర్యలు తీసుకుందని అన్నారు. అమ్మవారికి సమర్పించే మొక్కుబడులు, ఇతర కానుకులకు సంబంధించి బహిరంగ లెక్కింపు జరగనివ్వకుండా మంత్రి చేతివాటం చూపారని విమర్శించారు. అమ్మవారికి కోటి రూపాయల వరకూ వచ్చే కానుకల్లో.. రూ.50లక్షలు వెలంపల్లి కాజేశారని బుద్దా వెంకన్న అన్నారు. దేవుడి సొమ్ము తాను తినలేదని దుర్గమ్మ సన్నిధిలో తనబిడ్డలపై వెలంపల్లి ప్రమాణం చేసి చెప్పగలరా అని సవాల్ చేశారు. ఏసీబీ దాడులు రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో చేపడితే మంత్రి వెల్లంపల్లి అవినీతి తేలుతుందని తెదేపా నేత నాగుల్ మీరా అన్నారు.
బస్ కాంప్లెక్సులూ అమ్మేస్తారా...
"విశాఖ స్టీల్ ప్లాంట్‌కు ఉన్న అప్పులు తీర్చడానికి ఉన్న భూములు అమ్ముతాం అంటున్నారు. ఇప్పుడు ఆర్టీసీ నష్టాల్లో ఉందంటున్నారు. బస్ కాంప్లెక్స్‌లు అమ్మకానికో లేక అద్దెకో జగన్ ఇస్తారా?" -ట్విట్టర్ లో తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి
ఎస్సీలే సీఎం జగన్‌ను గద్దె దింపే రోజు దగ్గర్లో ఉంది: పీతల సుజాత
మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఇంటిపై దాడి వైకాపా దమనకాండకు నిదర్శనమని మాజీ మంత్రి పీతల సుజాత ఆరోపించారు. బాధ్యుల్ని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఏపీలో ఎస్సీ వ్యతిరేక ప్రభుత్వం నడుస్తోందన్నారు. ఎస్సీలే సీఎం జగన్‌ను గద్దె దింపే రోజు దగ్గర్లోనే ఉందని హెచ్చరించారు.
ఇదీ చదవండి: 'ఉల్లంఘనలు జరిగినట్లు తేలితే మళ్లీ ఆశ్రయించవచ్చు'