రాజధానిగా అమరావతినే కొనసాగించాలి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కృష్ణా జిల్లా తిరువూరులో తెదేపా నేతలు ఆందోళనకు దిగారు. మూడు రాజధానులు ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. లోటు బడ్జెట్లో ఉన్నప్పుడు మూడు రాజధానులు ఎలా కడతారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్రం నిరసనలతో అట్టుడుకుతున్నా ముఖ్యమంత్రికి కనిపించటం లేదా అని ప్రశ్నించారు. రాజధానిగా అమరావతిని కొనసాగించకపోతే ఉద్యమం మరింత తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు.
ఇదీ చదవండి: 'మూడు రాజధానులు వద్దు... అమరావతి ముద్దు '