ETV Bharat / state

వివేకా హత్య కేసు నిందితులకు రక్షణ కల్పించాలి.. జైళ్ల శాఖ డీజీకి వర్ల లేఖ

జైళ్ల శాఖ డీజీకి తెదేపా సీనియర్ నేత వర్ల రామయ్య లేఖ రాశారు. కడప జైల్లో ఉన్న వైఎస్ వివేకా హత్య కేసులో నిందితులను వేరొక జైలుకు తరలించాలని కోరారు.

TDP  leader Varla Ramaiah letter to Director General of Prisons

author img

By

Published : Feb 16, 2022, 5:35 PM IST

TDP leader Varla Ramaiah : కడప జైల్లో ఉన్న వైఎస్ వివేకా హత్య కేసులో నిందితులను వేరొక జైలుకు తరలించాలని జైళ్ల శాఖ డీజీకి తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య లేఖ రాశారు. కడప సెంట్రల్ జైల్లో ఉన్న వైఎస్ వివేకా హత్య కేసులో నిందితులకు రక్షణ కల్పించాలని కోరారు. దేవిరెడ్డి శంకర్ రెడ్జి, సునీల్ యాదవ్, గజ్జల ఉమా శంకర్ రెడ్డిలను వేరే జైలుకు తరలించాలని విజ్ఞప్తి చేశారు. గతంలో మొద్దు శీనును జైల్లో హత్య చేసిన అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని పేర్కొన్నారు. జైల్లో ఉన్న వివేకా హత్య కేసు నిందితులకు ప్రాణాపాయం లేకుండా రక్షణ కల్పించాలని సూచించారు. ఏదైనా జరగరానిది జరిగితే రాష్ట్ర ప్రభుత్వ పాత్ర ఉందని భావించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

సీబీఐకి వర్ల లేఖ... వరుణారెడ్డి బదిలీ...!
Kadapa Jail In-Charge Superintendent transfer : కడప జైలు ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్‌ వరుణారెడ్డి బదిలీ అయ్యారు. కడప నుంచి ఒంగోలు జైలర్​గా వరుణారెడ్డిని బదిలీ చేశారు. ఆయన స్థానంలో ఒంగోలు జైలు సూపరింటెండెంట్‌ ప్రకాశ్‌కు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.

సీబీఐకి వర్ల లేఖ..
Varla Letter to CBI: వైఎస్ వివేకా హత్య కేసు నిందితుల ప్రాణాల భద్రత దృష్ట్యా కడప కేంద్ర కారాగార జైలర్ పి. వరుణారెడ్డిని అక్కడ నుంచి బదిలీ చేయాలని సీబీఐ డైరక్టర్​కు తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య లేఖ రాశారు. ప్రస్తుతం కడప కేంద్ర కారాగారం సూపరింటెండెంట్‌గా ఉన్న వరుణారెడ్డి.. గతంలో అనంతపురం జిల్లా జైలు జైలర్‌గా కూడా పని చేశారని తెలిపారు. ఆయన అనంతపురంలో పని చేస్తున్న సమయంలో పరిటాల రవీంద్ర రాజకీయ హత్యకేసులో ప్రధాన నిందితుడు మొద్దు శ్రీను కూడా అదే జైలులో బందీగా ఉన్నాడన్నారు. ఆ సమయంలో మొద్దు శ్రీనును సహ నిందితుడే సిమెంట్ డంబ్ బెల్​తో దారుణంగా హతమార్చాడని వర్ల పేర్కొన్నారు. అప్పటి అనంతపురం జిల్లా జైలు జైలర్ వరుణా రెడ్డిపై పలు ఆరోపణలు రావటంతో సస్పెన్షన్​కు గురయ్యారని వర్ల గుర్తు చేశారు. కడప కేంద్ర కారాగారంలో వరుణారెడ్డిని నియమించడంతో పూర్వాపరాల గురించి తెలిసిన అనేక మంది విస్మయం చెందుతున్నారని వర్ల వెల్లడించారు. వివేకానంద రెడ్డి హత్యకేసులో నిందితులుగా ఉన్న ముగ్గురి ప్రాణాలకు రక్షణ కల్పించేందుకు వారిని కడప కేంద్ర కారాగారం నుంచి రాజమండ్రికి మార్చాలని, లేదా వరుణారెడ్డిని కడప జైలు నుంచి బదిలీ చేయలని కోరారు.

ఇదీ చదవండి:

'ఆ ఎమ్మెల్యేను సీఎం జగన్ కొట్టారు' అంటూ పోస్టు.. రంగంలోకి పోలీసులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.