కాంగ్రెస్‌లో ఉండగా మంత్రులు బొత్స, కన్నబాబు.. సీఎం జగన్పై చేసిన విమర్శలను ప్రజలెవ్వరూ ఇంకా మర్చిపోలేదని తెదేపా అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యాలరావు అన్నారు. వైకాపా చంచల్ గూడ జైలు పార్టీ అన్న కన్నబాబు లాంటి వారికి మంత్రి పదవులెందుకు ఇచ్చారో అందరికీ తెలుసని ఆక్షేపించారు. తన అవినీతిని బయటపెడతారనే భయంతోనే బొత్స, కన్నబాబులకు.. సీఎం జగన్ మంత్రి పదవులిచ్చారని విమర్శించారు.
రాష్ట్రంలో సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే కొడాలి నాని అసెంబ్లీలో ఏకాపాత్రాభినయం చేశారని ఎద్దేవా చేశారు. మంత్రి పదవులు కాపాడుకోవడం కోసం ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని పిల్లి మాణిక్యాలరావు దుయ్యబట్టారు.
ఇదీ చదవండి: ఏపీ - అమూల్ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం జగన్