ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించిన కరోనా వారియర్స్ విషయంలో వైకాపా ప్రభుత్వ తీరు అభ్యంతరకరంగా ఉందని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆక్షేపించారు. కరోనా వారియర్స్‌కు నెలల తరబడి వేతనాలు ఇవ్వకపోగా విధుల్లో నుంచి తొలగించడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కరోనా రెండో దశలోనూ వైకాపా ప్రభుత్వం అలసత్వం వీడట్లేదని పట్టాభి విమర్శించారు. గుంటూరులో ఫ్రంట్ లైన్ వారియర్స్‌పై లాఠీచార్జ్ చేయడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే కరోనా వారియర్స్‌కు పెండింగ్ వేతనాలు చెల్లించి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కరోనా వారియర్స్‌ను విధుల్లోకి తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్త ఆందోళన చేపడతామని పట్టాభిరామ్ హెచ్చరించారు.
ఇదీ చదవండి: దైవదర్శనానికి వెళ్తూ.. తిరిగిరాని లోకాలకు