అంబులెన్సులు ఆపి ప్రజలు జీవించే హక్కును తెలంగాణ ప్రభుత్వం హరిస్తుంటే.. ఏపీ ప్రభుత్వం చోద్యం చూస్తోందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్‌బాబు ధ్వజమెత్తారు. మానవత్వం లేకుండా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరించటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే హక్కు రెండు ప్రభుత్వాలకు ఎవరిచ్చారని నిలదీశారు. విభజన చట్టం ప్రకారం 10ఏళ్ల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ అని తెలిసికూడా ముఖ్యమంత్రులు జోక్యం చేసుకోకుండా వ్యవహరించడమేమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంబులెన్సుల అడ్డగింతపై హైకోర్టు హెచ్చరించినా తెలంగాణ ప్రభుత్వం దాగుడుమూతలాడటం దుర్మార్గమని నక్కా ఆనంద్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు, కృష్ణా, కర్నూలు జిల్లాల వద్ద సరిహద్దుల్లో పరిస్థితి హృదయవిదారకంగా ఉందన్నారు.
ఇదీ చదవండి: కరోనా భయోత్పాతం : విజయనగరంలో కుటుంబాన్ని కబలించిన మహమ్మారి