వైకాపా నేతలు చంద్రబాబును విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అన్నారు. జగన్ మెప్పు కోసమే వారు ఇలా చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో భూ కుంభకోణంపై పట్టించుకోరుగానీ... ఆరోపణలతో పబ్బం గడుపుతున్నారుని దుయ్యబట్టారు.
న్యాయమూర్తులను కూడా బెదిరించే స్థాయికి వైకాపా నేతలు వెళ్లారు. న్యాయస్థానం, న్యాయమూర్తులపై కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఆధారాలతో సహా ఆరోపిస్తే సమాధానం చెప్పవచ్చు. అనవసర ఆరోపణలు చేయడం వల్ల ప్రజల్లో చులకన అవుతున్నారు. చిత్తశుద్ధి ఉంటే కేసుల విచారణ వెంటనే చేయించుకోవాలి. ప్రత్యేక హోదాపై ఎన్నికలకు ముందు ప్రగల్భాలు పలికారు... ఇప్పుడు వదిలేశారు. ప్రత్యేక హోదాపై ఆనాడు ప్రశ్నించిన వాళ్లు అధికారంలోకి వచ్చాక పట్టించుకోవట్లేదు. వైకాపాకు సంఖ్యా బలం ఉంది కదా?... ప్రత్యేక హోదా కోసం 28 మంది రాజీనామా చేయవచ్చు కదా?- కనకమేడల రవీంద్రకుమార్, తెదేపా ఎంపీ
ఇదీ చదవండి