వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఇంటి దొంగల ప్రమేయం ఉందా అని ముఖ్యమంత్రి జగన్ను తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రశ్నించారు. వివేకాది పక్కా రాజకీయ హత్యేనన్న గోరంట్ల.. ఆ కేసు ఇప్పటికీ మిస్టరీగానే ఉందని అన్నారు. వివేకానందరెడ్డి కుమార్తె సునీతా రెడ్డి స్వయంగా ఈ హత్య కేసు దర్యాప్తు సరిగా కొనసాగడం లేదని చెప్పడం బాధాకరమన్నారు. ఆ అంశంపై ముఖ్యమంత్రి స్పందించాలని డిమాండ్ చేశారు.
ఇదీచదవండి.