ప్రధాని, హోం మంత్రి ఒక ముఖ్యమంత్రికి అపాయింట్‌మెంట్ ఇవ్వడానికి ఎందుకు నిరాకరించారని మాజీ మంత్రి జవహర్ ప్రశ్నించారు. ఏడాదిగా రాష్ట్ర చరిత్రను సీఎం జగన్ దిగజారుస్తూనే ఉన్నారని ఆయన ఆరోపించారు.
ముఖ్యమంత్రి జగన్ పాలన కంటే పగకే ప్రాధాన్యమిస్తున్నారని మండిపడ్డారు. ఎవరు ఏ శాఖకు మంత్రో తెలియని పరిస్థితి బహుశా ఇప్పుడే చూస్తున్నామని విమర్శించారు. ఒక తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం వంద తప్పులు చేస్తున్నారని ఆక్షేపించారు. రాష్ట్ర ప్రగతి, ప్రతిష్టను కాపాడుకోవాలంటే సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలో నుంచి దిగిపోవాలని జవహర్ డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: ముఖ్యమంత్రి జగన్ దిల్లీ పర్యటన వాయిదా