ETV Bharat / state

పరిటాలలో వైకాపా, తెదేపా ఘర్షణ... ముగ్గురికి గాయాలు

కృష్ణా జిల్లా పరిటాలలో తెదేపా, వైకాపా కార్యకర్తల మధ్య వాగ్వాదం ఘర్షణకు దారి తీసింది. ఈ ఘటనలో ముగ్గురు తెదేపా కార్యకర్తలకు గాయాలయ్యాయి. కోడెల సంస్మరణ సభను జరిపే అంశంపై మాట్లాడుతుండగా తమపై దాడి చేసినట్లు బాధితులు ఆరోపించారు.

పరిటాలలో వైకాపా తెదేపా అనుచరుల మధ్య ఘర్షణ... ముగ్గురికి గాయాలు
author img

By

Published : Sep 29, 2019, 10:46 PM IST

పరిటాలలో వైకాపా తెదేపా అనుచరుల మధ్య ఘర్షణ... ముగ్గురికి గాయాలు

కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పరిటాలలో వైకాపా, తెదేపా కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో తెదేపాకు చెందిన ముగ్గురు వ్యక్తులపై బీరు సీసాతో ప్రత్యర్థులు దాడి చేశారు. బాధితులను నందిగామ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మాజీ స్పీకర్ కోడెల వర్ధంతిని కార్యక్రమాన్ని గ్రామంలో నిర్వహించే విషయమై చర్చిస్తుండగా... వైకాపాకు చెందినవారు గొడవకు దిగినట్లు బాధితులు ఆరోపించారు.

ఇవీ చూడండి

రక్షణగా పెట్టిన వైర్లే.. వ్యక్తి ప్రాణం తీశాయి!

Intro:Ap_Vsp_94_29_Innovative_Ebyke_Pkg_AP10083
కంట్రిబ్యూటర్: కె.కిరణ్
సెంటర్: విశాఖ సిటీ
8008013325
( ) వినూత్న ఆలోచనలను క్రియాత్మకంగా నిరూపించారు ఆ యువత. ఇటీవల కాలంలో ద్విచక్ర వాహనాల ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని.. వాహనం ప్రమాదానికి చేరువైతే క్షణాల్లో సెన్సార్ల ద్వారా బంధువులకు, అంబులెన్సు వంటి అత్యవసర వ్యవస్థలకు సంకేతాలను పంపే ప్రత్యేక సౌకర్యాలతో ఒక ఎలక్ట్రికల్ ద్విచక్ర వాహనాన్ని (ఈ బైక్) రూపొందించారు. దీన్ని వ్యాపారాత్మకంగా వినియోగంలోకి తేవాలని ఆ విద్యార్థులు తహతహలాడుతున్నారు.

Body:చిత్తూరు జిల్లా మదనపల్లి ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థులు విశాఖ శివారులోని ఒక ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్న ఈ బైక్, గో కార్టింగ్ పోటీలకు వచ్చారు. తాము రూపొందించిన వినూత్న ఎలక్ట్రికల్ ద్విచక్రవాహనాన్ని ఈ సందర్భంగా ప్రదర్శించారు. ఆదిత్య కళాశాలలోని రీసెర్చ్ క్లబ్ కు చెందిన 26 మంది విద్యార్థుల బృందం ఈ బైక్ ను రూపొందించింది. ముందుగా రూపొందించిన చిప్ (డ్రైవింగ్ లైసెన్స్ కు ఉండే చిప్) వినియోగించి మాత్రమే ఈ వాహనాన్ని స్టార్ట్ చేసే అవకాశం ఉంటుంది. దీని వల్ల వాహన చోరీని నివారించవచ్చు. అదేవిధంగా ప్రత్యేక డిటెక్షన్ సెన్సార్ లను ఈ వాహనంలో వినియోగించడం వల్ల వాహనం ఎక్కడైనా ఒరిగితే, వెంటనే బంధువులకు, అంబులెన్సు వంటి వ్యవస్థలకు అప్రమత్తం చేసి సందేశం పంపే విధంగా వాహనంలో ఏర్పాట్లు చేశారు. లాటిట్యూడ్, లాంగిట్యూడ్ ఆధారంగా సంకేతాలు వెళ్లే ఏర్పాట్లు ఈ వాహనంలో ఉన్నాయి.

Conclusion:రెండు నెలలపాటు ఈ బృందం కష్టించి ఈ విద్యుత్ వాహనం లక్షా 10 వేల రూపాయలకు రూపొందించారు. రానున్న కాలంలో ఈ వాహనాన్ని వాణిజ్యపరంగా మార్కెట్లోనికి విడుదల చేసేందుకు విద్యార్థుల బృందం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

బైట్: మోహన్, టీం లీడర్.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.