కృష్ణాజిల్లా నందిగామ మండలం మాగల్లు ఇసుక ర్యాంపు దగ్గర తెలుగుదేశం నేతలు ధర్నా నిర్వహించారు. అక్రమ క్వారీయింగ్ ఆపివేయాలని డిమాండ్ చేశారు. మాగల్లు ఇసుక ర్యాంపు సర్వే నెంబర్ 67, 68 కాగా... ప్రభుత్వ పోరంబోకు భూమి సర్వే నెం.65లో క్వారీయింగ్ జరుగుతుందని ఆరోపించారు. అక్రమ క్వారీయింగ్ చేసి కోట్లాది రూపాయలు దోచుకున్న లీజుదారుల లీజు రద్దు చేయాలని కోరారు. వారిపై కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలన్నారు.
ఇవీ చదవండి... 'బాధలు చెప్పుకోవడానికి వస్తే...అనుమతి ఇవ్వలేదు'