ఇవీ చూడండి.
శభాష్ అవినాష్... మానవత్వంతో మనసు దోచాడు - గుడివాడ
కృష్ణా జిల్లా గుడివాడ తెదేపా అభ్యర్థి దేవినేని అవినాష్ మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ చిరు వ్యాపారిని గుర్తించి వాహనంలో ఆసుపత్రికి తరలించారు. వైద్య ఖర్చులకు ఆర్థిక సాయం చేశారు.
గాయపడిన చిరు వ్యాపారిని ఆసుపత్రికి తరలిస్తున్న దేవినేని అవినాష్
కృష్ణా జిల్లా గుడివాడ తెదేపా అభ్యర్థి దేవినేని అవినాష్ మానవత్వాన్ని చాటుకున్నారు. ఓ జామకాయల వ్యాపారిని లారీ ఢీకొట్టి వెళ్లిపోయిన ఘటనను గమనించిన వెంటనేస్పందించారు. ముళ్లపొదల్లో పడి ఉన్న చిరువ్యాపారిని అటుగా వెళ్తున్న అవినాష్ గుర్తించి ఆసుపత్రికి తరలించారు. వైద్య ఖర్చులకు ఆర్థిక సహాయం అందించారు. పదిరోజుల వ్యవధిలో ఇలాంటి రెండు ఘటనలపై అవినాష్ ఇదే విధంగా స్పందించారు. దేవినేని తీరుపట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చూడండి.
sample description
Last Updated : Mar 28, 2019, 1:41 PM IST