కరోనా బాధితులకు అండగా నిలచేందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు.. నేడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉన్న కొవిడ్ ఆసుపత్రులను సందర్శించనున్నారు. బాధితులకు భరోసా పేరుతో నిర్వహించే ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొంటారని తెదేపా కేంద్ర కార్యాలయం తెలిపింది.
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమం కొనసాగుతుందని పేర్కొంది. కొవిడ్ ఆసుపత్రుల్లో సౌకర్యాలను పార్టీ నేతల బృందం పరిశీలించి.. కరోనా రోగులకు అందుతున్న వైద్య సహాయం, మందులు, భోజనం ఇతర సదుపాయాల గురించి అడిగి తెలుసుకోనున్నారు.
ఇవీ చూడండి:
కరోనా రహిత జిల్లాగా మార్చేందుకు సహకరించండి: కలెక్టర్ ఇంతియాజ్