ఎన్నికలముందు వైకాపా గుప్పించిన హామీలు ఏమయ్యాయో ముఖ్యమంత్రి జగన్ సమాధానం చెప్పాలని... తెదేపా నేత దేవినేని ఉమ నిలదీశారు. 45 ఏళ్లకే పెన్షన్, ఎంతమంది పిల్లలకైనా అమ్మఒడి, డ్వాక్రా రుణాల మాఫీ, సన్నబియ్యం, పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్,పెళ్లికానుక, కార్పొరేషన్ల ఏర్పాటు ఏమయ్యాయని ప్రశ్నించారు. 12 నెలల్లో మాటతప్పి, మడమ తిప్పింది నిజమా.. కాదా.. అంటూ ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు సీఎం జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు విశాఖపట్నం వస్తానంటే.. వైకాపాకు గుండెజారి గల్లంతయిందా అని తెదేపా నేత వర్ల రామయ్య ప్రశ్నించారు.
ఇదీ చదవండి: కడుపున పుట్టిన వాడు కాదన్నాడు.. కానివాళ్లే 'చివరి' దిక్కయ్యారు!