తెదేపా కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. నాయకులు కేక్ కట్ చేసి చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఉన్న చంద్రబాబు.. 71 ఏళ్లు పూర్తి చేసుకొని 72వ ఏట అడుగుపెట్టారని నేతలు పేర్కొన్నారు. రాష్ట్రం కోసం అహర్నిశలు శ్రమించిన వ్యక్తి చంద్రబాబని కొనియాడారు. రాష్ట్రం మళ్లీ గాడిలో పడాలంటే.. చంద్రబాబు అధ్యక్షతన తెలుగుదేశం ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఆలపాటి రాజా, ఎమ్మెల్సీలు టీడీ జనార్థన్, అశోక్ బాబు, అధికార ప్రతినిధి పట్టాభి తదితర నేతలు పాల్గొన్నారు.
ఇవీ చూడండి...