అమరావతిలోని ఎన్టీఆర్ భవన్లో 'చంద్రన్న సైనికుడు' డైరీని తెదేపా అధినేత చంద్రబాబు ఆవిష్కరించారు. కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గానికి చెందిన తెలుగు యువత విభాగం నాయకుడు వల్లూరు కిరణ్ ఈ డైరీని రూపొందించారు. పార్టీ సమాచారాన్ని, ముఖ్య నాయకుల వివరాలు డైరీలో పొందుపర్చడం అభినందనీయమని చంద్రబాబు అన్నారు. పార్టీ పిలుపునిచ్చిన ప్రతీ కార్యక్రమంలోనూ కిరణ్ చురుగ్గా పాల్గొంటున్నారని ఆయన ప్రశంసించారు.
అమరావతి ఉద్యమంపై ఎమ్మెల్సీ అశోక్‍బాబు రూపొందించిన మరో క్యాలెండర్‍ను చంద్రబాబు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అశోక్ బాబు, అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి, దారపనేని నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: 'ఉపాధి హామీ పథకంలో మహిళలకు తీవ్ర అన్యాయం'