రాష్ట్రంలో ఇసుక కొరతకు వ్యతిరేకంగా ఈనెల 14వ తేదీన తెదేపా అధినేత చంద్రబాబు తలపెట్టిన దీక్షకు భాజపా మద్దతును ఆ పార్టీ కోరింది. ఈ మేరకు మాజీ మంత్రి ఆలపాటి రాజా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను కలిశారు. ఇసుకపై ఏ రాజకీయపార్టీ స్పందించినా మా మద్దతు తప్పక ఉంటుందని కన్నా స్పష్టం చేశారు.
విజయవాడలో దీక్ష
ఇసుక కొరతపై విజయవాడ ధర్నా చౌక్‌లో చంద్రబాబు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నిరసన దీక్ష చేయనున్నారు. వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలతో కలిసి ఇసుక కొరత వల్ల ఉపాధి కోల్పోయిన కార్మికులకు మద్దతుగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు పార్టీ శ్రేణులు తెలిపాయి.
ఇదీ చూడండి: