ETV Bharat / state

'అక్రమాలను ప్రశ్నిస్తే దాడి చేస్తారా..?'

సామాజిక కార్యకర్త పసుపులేటి సూర్యప్రకాశ్​ను పరామర్శిస్తే తన ఇంటిపై వైకాపా నేతలు దాడికి యత్నించారని నందిగామ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్మ ఆరోపించారు. గతరాత్రి పదిన్నర గంటల సమయంలో రెండు ఆటోల్లో వచ్చి తన ఇంటిపై దాడికి యత్నించారని ఆగ్రహం వ్యక్తంచేశారు.

tangirala soumaya protest aginst attack on her house

author img

By

Published : Feb 22, 2021, 1:50 PM IST

ఆదివారం రాత్రి వైకాపా నాయకులు తన ఇంటిపై దాడికి యత్నించారని కృష్ణా జిల్లా నందిగామ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్మ ఆరోపించారు. దీనికి నిరసనగా తన నివాసంలో నిరసన దీక్ష చేపట్టారు. వైకాపా ప్రభుత్వం చేసే అక్రమాలను, అన్యాయాలను ప్రశ్నిస్తే దాడి చేయడం హేయమైన చర్య అని నిలదీశారు. గతరాత్రి పదిన్నర గంటల సమయంలో రెండు ఆటోల్లో సుమారు 20 మంది వ్యక్తులు వచ్చి తన ఇంటిపై దాడికి యత్నించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈనెల 18న నందిగామ మండలం లింగాలపాడు గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త పసుపులేటి సూర్యప్రకాశ్​పై కొందరు మహిళలు దాడి చేశారని సౌమ్య తెలిపారు. ఆయనను పరామర్శించేందుకు వెళ్లినందుకు.. ఇంటిపై దాడికి యత్నించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు రక్షణ కల్పించాలని కోరారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతం : ఎస్​ఈసీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.