కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లిలో తల్లి, ఇద్దరు పిల్లలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. కొండపల్లి మటన్ మార్కెట్ సెంటర్ సమీపంలో నివసించే వారి ఇంట్లో ఉదయం నుంచి ఎవరూ బయటకు రాకపోవడంతో స్థానికులు తలుపులు తెరిచి చూడగా... తల్లి, ఇద్దరు పిల్లలు అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. అది గమనించిన స్థానికులు వెంటనే...ఇబ్రహీంపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించగా వారికి చికిత్స అందించేందుకు సిబ్బంది నిరాకరించారు. దీంతో మరో ఆసుపత్రికి తరలించేలోపే ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చదవండి