కృష్ణాజిల్లా తిరువూరు మండలం మునుకుల్లలో ఓ కౌలు రైతు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దుబ్బాక రాము పదేళ్లుగా భూములను కౌలుకు తీసుకొని పంటలు సాగు చేశారు. వాతావరణ పరిస్థితుల సహకరించక పంట దిగుబడి తగ్గింది. వచ్చిన పంటకు గిట్టుబాటు ధర లేక అప్పుల భారం పెరిగింది. వడ్డీ వ్యాపారుల నుంచి తీసుకున్న అప్పు చెల్లించాలంటూ ఒత్తిడి పెరిగింది. తట్టుకోలేని రాము పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. చికిత్స కోసం ఆసుపత్రికి తరలించిన ప్రయోజనం లేకపోయింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి:ఇసుమంతైనా కనికరం లేదా.. ఆ అమ్మకు?