కృష్ణా జిల్లా నందిగామ రైతుబజార్లో రాష్ట్ర ప్రభుత్వం ఉల్లిపాయలను సబ్సిడీతో ప్రజలకు అందిస్తోంది. కిలో 25 రూపాయలకు విక్రయించే కౌంటర్లను ఎమ్మెల్యే జగన్మోహన్ రావు ప్రారంభించారు. ప్రజలపై అదనపు భారం పడకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉల్లిని అందజేస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అనంతరం రైతుబజార్లోని మంచినీటి ట్యాంకు, మరుగుదొడ్లు, పరిసర ప్రాంతాలను పరిశీలించి శుభ్రతపై తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజల వినియోగార్థం రైతు బజార్ సమీపంలో అదనపు మరుగుదొడ్ల నిర్మాణానికి స్థల పరిశీలన చేసి ఎస్టేట్ అధికారికి తగు సూచనలు చేశారు.
ఇదీ చదవండి :