ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ వనం-మనం కార్యక్రమంలో కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ని మిక్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు సందర్శించారు. భావితరాలకు అవసరమైన వాతావరణ సమతుల్యత అడవుల నుంచి ఎక్కువ లభిస్తుందని స్థానిక అటవీశాఖ రేంజర్ లెనిన్ బాబు అన్నారు. విద్యార్థులు చదువుతోపాటు ప్రకృతి అవసరాలు గుర్తించాలని కోరారు. అటవీశాఖ ఆధ్వర్యంలో జరిగే ఈ కర్యాక్రమాన్ని ప్రతి ఒక్క కళాశాల యాజమాన్యం సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అటవీశాఖ సిబ్బంది పాల్గొని విద్యార్థులకు అటవీ రక్షణపై అవగాహన కల్పించారు.
ఇదీ చదవండి