ETV Bharat / state

విద్యార్థుల కష్టాలు తీర్చిన కలెక్టర్ - schools

చదువుల కోసం ఊరు, ఏరు దాటి వెళ్లాలి. తమ పిల్లలు పడవపై నిత్యం అక్షర పయనం చేస్తుంటే ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని తల్లిదండ్రుల్లో ఆందోళన. ఉదయం వెళ్లిన పిల్లలు క్షేమంగా ఇంటికి తిరిగొచ్చే వరకూ కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూసే పరిస్థితి. ఈ బాధలన్నీ కృష్ణా జిల్లా కలెక్టర్‌ చొరవతో తొలగిపోయాయి. ఆయన ఏంచేశారు? ఎవరికోసం చేశారో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే...

students-happy-with-schools
author img

By

Published : Jul 7, 2019, 6:02 AM IST

విద్యార్థుల కష్టాలు తీర్చిన కలెక్టర్

కృష్ణా-పశ్చిమ గోదావరి జిల్లాల సరిహద్దులోని ఉప్పుటేరును ఆనుకుని కలిదిండి మండలంలో మట్టగుంట, సున్నంపూడి, దుంపలకోడుదిబ్బ, చినతాడినాడ గ్రామాలున్నాయి. ప్రాథమికోన్నత స్థాయివరకే ఇక్కడ విద్య అందుబాటులో ఉండేది. ఉన్నత పాఠశాల విద్యకోసం ఉప్పుటేరు దాటి వెళ్లాల్సిన పరిస్థితి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రాథమికోన్నత పాఠశాలకు, జడ్పీ ఉన్నత పాఠశాలలకు కనీసం 3 కిలోమీటర్ల దూరం ఉండాలి. 3 గ్రామాలకు జడ్పీ ఉన్నత పాఠశాల3 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నందున మట్టగుంటలోని ప్రాథమికోన్నత పాఠశాలకు ఉన్నత పాఠశాలగా వర్గోన్నతి కల్పించాలని ఎప్పుటినుంచో ఆందోళన చేస్తున్నారు.

ఇదే విషయంపై ఈటీవీ-ఈనాడు ఎప్పటికప్పుడు కథనాలు ఇస్తూనే ఉన్నాయి. ఈ కథనాలను చూసిన కలెక్టర్‌ ఇంతియాజ్‌ నేరుగా క్షేత్రస్థాయికి వెళ్లి పరిస్థితి తీవ్రతను గమనించారు. మట్టగుంటలో వెంటనే తొమ్మిదో తరగతిని ఏర్పాటు చేయడంతో పాటు ఆంగ్ల మాధ్యమాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని ఆదేశించారు.

తొమ్మిది, పదో తరగతులు అందుబాటులో లేనందున ఉప్పుటేరుకు అవతలవైపున ఉన్న పశ్చిమ గోదావరి జిల్లాలోని కలవపూడి జడ్పీ ఉన్నత పాఠశాలకు విద్యార్థులు వెళ్లేవారు. పడవపై రోజూ ప్రయాణం ఉప్పుటేరు దాటేవారు. చాలామంది ఇలా పంపేందుకు భయపడి తమ పిల్లలను చదువు మాన్పించేశారు. మరికొందరు పిల్లలు రోజూ క్షేమంగా ఇంటికి తిరిగొచ్చే వరకూ ఆందోళన చెందుతూ ఉండేవారు. కలెక్టర్‌ ఇంతియాజ్‌ నిర్ణయంతో ఇప్పుడు మట్టగుంట పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగింది. ఉపాధ్యాయుల కొరతను తీర్చాలని పిల్లల తల్లిదండ్రులు కోరుతున్నారు.

Intro:చిత్తూరు జిల్లా పుత్తూరు లోని జిజెఎం ఫంక్షన్ హాల్ లో బుధవారం నగరి నియోజకవర్గ కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి నగరి తెదేపా ఇన్చార్జ్ గాలి భాను ప్రకాష్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో తెదేపా వాటర్షెడ్ అంతమాత్రాన భయపడాల్సిన అవసరం లేదని తిరిగి 2024 లో అధికారాన్ని చేజిక్కించుకుని సత్తా తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఉందని తెలిపారు స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేందుకు నాయకులు కార్యకర్తలు సందర్భంగా ఉండాలన్నారు తాను ఎల్లప్పుడూ నాయకులకు కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు ఈ సమావేశానికి నియోజకవర్గంలోని తెదేపా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Body:nagari

Conclusion:8008574570

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.