ETV Bharat / state

'ఆ నలుగురినీ వదలొద్దు.. కఠినంగా శిక్షించండి'

తెలంగాణలో దిశ హత్యోదంతంపై రాష్ట్రంలో నిరసన జ్వాల చల్లారడంలేదు. తక్షణమే నిందితులకు కఠిన శిక్ష అమలు చేయాలంటూ.. ర్యాలీలు, ప్రదర్శనలు కొనసాగుతున్నాయి.

రాష్ట్రవ్యాప్తంగా దిశా హత్యోదంతంపై నిరసన జ్వాలలు

author img

By

Published : Dec 4, 2019, 3:59 AM IST

Updated : Dec 4, 2019, 7:49 AM IST

రాష్ట్రవ్యాప్తంగా దిశా హత్యోదంతంపై నిరసన జ్వాలలు

హైదరాబాద్‌ శివార్లలో దిశను అత్యాచారంచేసి హతమార్చిన నలుగురిని తక్షణమే శిక్షించాలంటూ కర్నూలు జిల్లా బనగానపల్లెలో ఎంఐఎం ఆధ్వర్యంలో ర్యాలీ చేశారు. పెట్రోల్‌ బంక్‌ కూడలిలో మానవహారంగా ఏర్పడ్డారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో మదీనా మసీదు నుంచి...... గాంధీ విగ్రహం వరకూ ర్యాలీ చేసి.. కొవ్వొత్తులు వెలిగించారు. అనంతపురంలో విద్యార్థులు కొవ్వత్తుల ర్యాలీ చేపట్టి మానవహారంగా నిరసన తెలిపారు.

యర్రగొండపాలెంలో ప్లకార్డులతో ప్రదర్శనలు

దిశ కుటుంబానికి న్యాయం చేయాలంటూ ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో... కళాశాలల విద్యార్థినులు ప్లకార్డులు ప్రదర్శించారు. కృష్ణా జిల్లా మైలవరంలో ఓ ప్రైవేట్‌ కళాశాల విద్యార్థినులు ర్యాలీచేయగా విజయవాడ ప్రధాన కూడళ్లల్లో హిజ్రాలు ప్రదర్శన చేశారు.

అక్షరాల ఆకృతిలో "దిశ"కు అంజలి

దిశపై జరిగిన పాశవిక ఘటనకు నిరసనగా పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో జనసేన.. ర్యాలీ నిర్వహించింది. తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో దిశ అక్షరాల ఆకృతిలో విద్యార్థినులు అంజలి ఘటించారు. మహిళా ఉపాధ్యాయులు,..... అంగన్‌వాడీ కార్యకర్తలు కొవ్వత్తుల ర్యాలీ చేపట్టారు.

ర్యాలీలు.. నిరసనలు

విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయం ఎదుట కొందరు విద్యార్థులు నిరసన తెలపగా... కూర్మన్నపాలెం నుంచి వడ్లపూడి వరకూ మరికొందరు ర్యాలీ చేపట్టారు. అనకాపల్లిలో ఎన్టీఆర్ క్రీడా మైదానం నుంచి ప్రధాన రహదారుల మీదుగా విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. విజయనగరం జిల్లా పార్వతీపురంలోని సుందరయ్య భవనం నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్‌ కూడలి వరకూ విద్యార్థి సంఘాలు ర్యాలీ చేశాయి.కడప జిల్లా రాయచోటిలో యువత కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించింది. కొత్తపేట జగదాంబ సెంటర్ నుంచి ఎంపీడీవో రెవిన్యూ కార్యాలయాలు బస్టాండ్ రోడ్డు మీదుగా నేతాజీ కూడలి వరకు యువత ర్యాలీ నిర్వహించింది

ఇవీ చదవండి

హోరెత్తిన ప్రజా,విద్యార్థి సంఘాలు.... దిశాకు న్యాయం చేయాలి

Intro:AP_RJY_81_03_DISHA_CADLERALLY_ANPMLA_AVB_AP10107

() హైదరాబాద్ దిశ హత్య ఘటనను నిరసిస్తూ తూర్పుగోదావరి జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మెయిన్ రోడ్డులో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమం లో అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, మహిళాసంఘాలు, స్వచ్చంధ సేవాసంఘాలు, రెడ్డి సంఘాలతో కలిసి ర్యాలీ లో పాల్గొన్నారు. అనపర్తి మెయిన్ రోడ్డులోని గాంధి బొమ్మ నుంచి దేవిచౌక్ వరకు కొవ్వొత్తుల నడిచి నడిచి మహిళల పట్ల అమానుష దాడులు, హత్యలు అత్యాచారాలు కఠినశిక్షల ద్వారా నియంత్రించాలని నినాదాలు చేశారు. దిశ హత్యను ముక్తకంఠంతో కండిస్తూ బాద్యులైన వారిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు

byte1 సత్తి సూర్యనారాయణ రెడ్డి, ఎమ్మెల్యే, అనపర్తి
byte2 కాంతమ్మ, రెడ్డి సంక్షేమ సంఘం మహిళ అధ్యక్షురాలు
byte3 కర్రి త్రినాధ రెడ్డి, తూర్పుగోదావరి జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షుడు

Body:AP_RJY_81_03_DISHA_CADLERALLY_ANPMLA_AVB_AP10107

Conclusion:AP_RJY_81_03_DISHA_CADLERALLY_ANPMLA_AVB_AP10107
Last Updated : Dec 4, 2019, 7:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.